కేసీఆర్​తో మరోసారి హరీశ్​ భేటీ

కేసీఆర్​తో మరోసారి హరీశ్​ భేటీ

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్​ చీఫ్​కేసీఆర్​తో హరీశ్​రావు మరోసారి భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం ఎర్రవల్లిలోని ఫాంహౌస్​లో కేసీఆర్​తో అరగంటకుపైగా చర్చించారు. కేసీఆర్, హరీశ్​రావుకు మంగళవారం కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

దీనిపై మంగళవారం సాయంత్రమే కేసీఆర్, హరీశ్​రావు భేటీ అయ్యారు. తాజాగా గురువారం కూడా మళ్లీ కలిసి చర్చించారు. కమిషన్ విచారణకు హాజరవ్వాలా? వద్దా? అన్న అంశంపై వారిద్దరూ చర్చించినట్టు తెలిసింది. నోటీసులపై ఏ విధంగా స్పందించాలి? కమిషన్​కు ఏం రిప్లై ఇవ్వాలి? వంటి వాటిపైనా మంతనాలు జరిపినట్టు సమాచారం.