రైతుకు ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్‌

రైతుకు ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్‌

తెలంగాణలో  రైతులకు అండగా నిలిచేందుకు జిల్లాల బాట పట్టిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఓ రైతుకు అండగా నిలిచారు.   జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్‌తండాకు వెళ్లిన  కేసీఆర్ కు ఓ రైతు తన ఆవేదన వ్యక్తం చేశాడు . ‘పొలం ఎండిపోయింది. బిడ్డ పెళ్లి చేసేందుకు డబ్బుల్లేవు’ అంటూ తన బాధను వ్యక్తం చేశాడు.  

నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంటను కోల్పోయినానని చెప్పాడు.  దీనికి స్పందించిన కేసీఆర్ ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.  రైతులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. పార్టీ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. కేసీఆర్‌ వెంట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ తదితరులు ఉన్నారు. 

ALSO READ | కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు

 కాగా ఈ రోజు ఉదయం ఎర్రబెల్లి ఫామ్ హౌజ్ నుంచి  రోడ్డు మార్గాన జనగామ జిల్లాకు బయల్దేరారు కేసీఆర్. అక్కడ రైతులను పరామర్శించిన కేసీఆర్ అనంతరం  సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి బయల్దేరారు. సాయంత్రం నాలుగు గంటలకు కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.