బీఆర్ఎస్ శాసనసభపక్షనేతగా కేసీఆర్

బీఆర్ఎస్ శాసనసభపక్షనేతగా కేసీఆర్

బీఆర్ఎస్​ ఎల్పీ మీటింగ్ ముగిసింది.  బీఆర్ఎస్​ ఎల్పీ  నేతగా... కేసీఆర్ ను ఎన్నుకున్నారు. కేశవరావు అధ్యక్షతన కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ఇవాళ తెలంగాణ భవన్‌లో సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో సీనియర్ ఎమ్మెల్యే పోచారం కేసీఆర్ పేరు ప్రతిపాదించారు. కడియం, తలసాని బలపరిచారు.  

అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లను గెలిచి ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది బీఆర్ఎస్. ​ అయితే కేసీఆర్ కు ఆపరేషన్ కు కావడంతో ఆయన ఇవాళ్టి సమావేశానికి హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం లేదని చెప్పారు  పార్టీ నేతలు.  

మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.  బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీకి కేటీఆర్‌ హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యేలు పద్మారావు, ముఠా గోపాల్‌ కూడా సమావేశానికి రాలేదు.