
సీఎం కేసీఆర్ కు.. వారి కుటుంబ సబ్యులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్....ఈ శివరాత్రికైన కేసీఆర్ బుద్ది మారి నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లు వేయాలని కోరుతున్నానని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ పోటీపడి గ్రాడ్యుయేట్ ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి మీటింగ్ లు పెడుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను కుక్క తోకలుగా చూసే కేసీఆర్.. వాళ్ళను మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆపించారు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి వాళ్లే మోసం చేసుకుంటున్నారు. ఒక జేబులో పాల ప్యాకెట్, మరో జేబులో పటాకులు పెట్టుకొని తిరుగుతున్నారు.నార్మల్ గా ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే పీఆర్సీని.. కేసీఆర్ ఓట్లకోసం వాడుకుంటున్నారన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 27 శాతం ఇస్తే.. 29 శాతం పీఆర్సీ ఇస్తా అని కేసీఆర్ అనడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగులకు 45 శాతం పిట్ మెంట్ తోపాటు.. వారి సమస్యలు పరిష్కరిస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల నుండి తప్పుకుంటుందన్నారు. రెండున్నర ఏళ్ళు అవుతున్నా నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. అంతేకాదు గ్రేటర్ లో వరద సాయం కూడా ఇంకా ఇవ్వలేదని తెలిపారు.నగరంలో ఉచిత మంచినీరు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. ఉత్తమాటలతో.. సీఎం కేసీఆర్ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. కేటీఆర్.. గత రెండు మూడు రోజులుగా విద్యాసంస్థలతో వరుసగా మీటింగ్ లు పెడుతున్నారని...కాంగ్రెస్ నగర ప్రజల దాహార్తి తీర్చడానికి కృష్ణ వాటర్ తీసుకొస్తే.. అది కూడా మేమే చేశామని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఆర్టిజన్ కార్మికుల చావులకు కారణం ఎవరో.. కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు శ్రవణ్. కేటీఆర్ వారిని పర్మినెంట్ చేశామని చెప్పి విద్యుత్ శాఖలో ఆర్టిజన్ కార్మికులను మోసం చేశారన్నారు. పల్లా,వాణి దేవిలు గెలిచినా ఎవరికీ ఒరిగేదేమి లేదన్నారు. కానీ వారిని ఓడగొడితే.. నోటిఫికేషన్లు, పీఆర్సీ తప్పకుండా అమలవుతుందన్నారు. ఉద్యోగాల భర్తీపై చర్చకు రమ్మంటే.. ఎందుకు రాలేదని అడుగుతున్నానంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా.. బోగస్ ఓట్లపై ఇవాళ ఏరివేయాలని అనడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నానని తెలిపారు దాసోజు శ్రవణ్.