లాక్‌డౌన్‌పై అసెంబ్లీలో స్పష్టతనిచ్చిన కేసీఆర్

లాక్‌డౌన్‌పై అసెంబ్లీలో స్పష్టతనిచ్చిన కేసీఆర్


రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లాక్‌డౌన్ విషయంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ పెట్టె ఆలోచన లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆయన సూచించారు. దేశంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసింది తెలంగాణేనని సీఎం అన్నారు. విద్యాసంస్థల బంద్ తాత్కాలికమేనని కేసీఆర్ తెలిపారు. బాధతోనే విద్యాసంస్థలను బంద్ చేశామని ఆయన అన్నారు. గతంలో విధించిన లాక్‌డౌన్ వల్లే చాలా నష్టపోయామని కేసీఆర్ అన్నారు.