ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి

ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన రిలీజ్ చేసింది. అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని.. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి.. రెండో దశలో  భర్తీ చేయాలన్నారు. కొత్త జోన్ల ఏర్పాటుపై ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం రావడంతో ఖాళీల భర్తీకి అడ్డంకులు తొలిగాయన్నారు సీఎం.