కేసీఆర్.. హరీష్ రావు గొంతు కోశారు : వివేక్ వెంకటస్వామి

కేసీఆర్.. హరీష్ రావు గొంతు కోశారు : వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ : ప్రజల తీర్పు మేరకు బీజేపీలో జాయిన్ అయ్యానని తెలిపారు వివేక్ వెంకట స్వామి. వివేక్ వెంకటస్వామి, లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం పలు పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్.. బీజేపీలో జాయిన్ కావడంతో చాలా మంది మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారన్నారు. ప్రజా స్వామిక తెలంగాణ గురించి కేసీఆర్ మర్చిపోయారని.. కల్వకుంట్ల తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని..ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రజల కోసమే తెలంగాణ గురించి  కొట్లాడతున్నాము అని చెప్పిన కేసీఆర్..ఇప్పుడు కల్వకుంట్ల తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మహాబూబ్ నగర్ ఎన్నికల ఇంచార్జ్ గా హరీష్ రావును నియమించి.. గెలిచిన తర్వాత హరీష్ రావు గొంతు కోశారని చెప్పారు. ఉద్యమ కారులు అంటేనే కేసీఆర్ కు పడదని..అవినీతి చేస్తే అధికారుల మీద చర్యలు తీసుకుంటాను అని చెప్పిన కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన అవినీతిపై ఎవరు చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు వివేక్.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై  కమిషన్ ఏర్పాటు చేయాలన్న వివేక్..కేసీఆర్ తుగ్లక్ ఎమ్మెల్యే అని చెన్నూర్ ఎమ్మెల్యే కూడా ఒప్పుకున్నారన్నారు. కేసీఆర్ మొదట యూత్ కాంగ్రెస్, తర్వాత టీడీపీ… NTR కు వెన్నుపోటు పొడిచే దాంట్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాడన్నారు. నమ్మించి వెన్నుపోటు పొడవడంలో కేసీఆర్ దిట్ట అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు చెంప చెల్లుమనిపించారు..మరి కొద్దీ రోజుల్లో ఇంకో చెంప కూడా చెళ్లుమనిపిస్తారన్నారు. ప్రజలు ఆయనకు గుణపాఠం చెపుతారని.. మోడీ చక్కటి పాలన అందిస్తున్నారని తెలిపారు. అందరూ బీజేపీలో జాయిన్ అవ్వండని సూచించారు. కేసీఆర్ ను గద్దె దించే వరకు పోరాటం చేయాలన్నారు వివేక్ వెంకటస్వామి.