గ్లోబల్ ఇండియా నిర్మాత పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..

గ్లోబల్ ఇండియా నిర్మాత  పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..

మాజీ ప్రధాని పీవీ నరసింహరావును గ్లోబల్ ఇండియా నిర్మాతగా వర్ణించారు సీఎం కేసీఆర్. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీకి రావాల్సిన గుర్తింపు రాలేదని.. ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నారు. పీవీ మన ఠీవి అని తెలంగాణ సమాజం భావిస్తుందన్నారు. లైసెన్స్ పర్మిట్ రాజ్ ను పీవీ తొలగించారన్నారు. గ్లోబల్ ఇండియా నిర్మాతగా పీవీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. కాశ్మీర్ లో శాంతి నెలకోల్పారన్నారు. విద్యార్థి దశలోనే నిజాంకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే పీవీకి భారతరత్నప్రకటించాలన్నారు. దార్శనికతతో ధైర్యంగా ముందడుగు వేసిన ఘనత పీవీదేనన్నారు.

పార్లమెంట్ లో పీవీ విగ్రహం పెట్టాలన్నారు. పీవీ భూ సంస్కరణలకు నాంది పలికారన్నారు. పీవీ తన 800 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. పీవీ విద్యామంత్రిగా, గురుకుల, నవోదయ స్కూళ్లు స్థాపించారన్నారు.డిటెన్షన్ పద్దతిని రద్దు చేసిన ఘనత పీవీదేనన్నారు. పీవీ బహు భాషా కోవిదుడు, సహ్రస్తదళ పద్మం అని అన్నారు. పీవీ ఎన్నో కష్టాలు ఎదుర్కొని దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపారన్నారు. పీవీ దేశానికి సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చారన్నారు. విదేశాంగ విధానంలో పీవీ విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. రెండో అణు పరీక్షకు రంగం సిద్ధం చేసిన ఘనత పీవీదేనన్నారు కేసీఆర్.