కేసీఆర్ నిరంకుశత్వంగా వ్వవహరిస్తున్నారు: అశ్వత్థామరెడ్డి

కేసీఆర్ నిరంకుశత్వంగా వ్వవహరిస్తున్నారు: అశ్వత్థామరెడ్డి

కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ కార్మికుల న్యాయమైన సమ్మెను అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ కూడా రాజకీయ నాయకుడిలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ నిన్నటి(శనివారం) నుంచి అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్షకు దిగారు. ఇందిరాగాంధీ పార్క్ లో దీక్ష  చేయాలని అనుకున్నా పోలీసులు అనుమతించకుండా గృహనిర్బంధం చేయడంతో ఆయన ఇంట్లోనే దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించేదాకా దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టితో 44వ రోజుకు చేరుకుంది.