
దుబ్బాకలో ఓడిపోతామని తెలిసి సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఎన్నికల సర్వేలో టీఆర్ ఎస్ ఓడిపోతుందని తేలడంతోనే అక్కడ అరాచాకాలను ఆ పార్టీ పాల్పడుతోదని ఆరోపించారు. సిద్దిపేటలో పోలీసుల చర్యను నిరసిస్తూ బీజేపీ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని తన కార్యాలయంలో నిరసనకు దిగారు. సంజయ్ ను …డీకే అరుణ పరామర్శించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. గెలుపు కోసం పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కోడ్ లేని సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థుల బంధువుల ఇళ్లలో సోదాలు జరపడం అప్రజాస్వామికమని విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు డీకే అరుణ.