కాళేశ్వరంతో రూ.వేల కోట్లు నీళ్లపాలు : జువ్వాడి నర్సింగరావు 

కాళేశ్వరంతో రూ.వేల కోట్లు నీళ్లపాలు :  జువ్వాడి నర్సింగరావు 

కోరుట్ల,వెలుగు: నాసిరకంగా కట్టడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయి వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని కోరుట్ల కాంగ్రెస్​అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు. శుక్రవారం కోరుట్లలో జువ్వాడి నామినేషన్​వేశారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్​ నుంచి నందిచౌరస్తా వరకు శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్​అనంతరం నర్సింగరావు మాట్లాడుతూ కోరుట్ల లో వరదలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు కనిపించలేదన్నారు.

ఎమ్మెల్యే కొడుకు, బీఆర్ఎస్​అభ్యర్థి డాక్టర్​ సంజయ్​ డిస్కౌంట్​ డాక్టర్​ కాదనీ, రోగులకు బిల్లులు ఎక్కువ చేసి  కమీషన్లు తీసుకుంటున్నాడని ఆరోపించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో లీడర్లు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరం పాల్గొన్నారు.​ ​