వీ6‑వెలుగుపై కేసీఆర్​ మీడియా విషం

వీ6‑వెలుగుపై కేసీఆర్​ మీడియా విషం
  • వీ6‑వెలుగుపై కేసీఆర్​ మీడియా విషం
  • పేపర్ వెహికల్​లో కుట్టు మిషన్లు అంటూ కట్టుకథ
  • హుజూరాబాద్ తీసుకెళ్తున్నారంటూ విషప్రచారం
  • బతుకుదెరువు కోసం డ్రైవర్ రవాణా చేసిన సామాన్లకు ఎన్నికలతో లింకు
  • ప్రజాదరణను దెబ్బతీసే కుట్రలు.. తప్పుడు వార్తలతో నవ్వులపాలు

నిజామాబాద్ ​/ జగిత్యాల, వెలుగు: ‘వీ6–వెలుగు’పై సీఎం కేసీఆర్ సొంత మీడియా మరోసారి విషం కక్కింది. క్రెడిబిలిటీని దెబ్బతీసేందుకు కుట్ర పన్నింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ‘వీ6–వెలుగు’ వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ కట్టు కథలు అల్లింది. జగిత్యాల ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్​లోడ్​తో బుధవారం తెల్లవారుజామున నిజామాబాద్​కు వెళ్లిన హైర్ వెహికల్​ తిరిగి సాయంత్రం జగిత్యాలకు వస్తున్న వీడియోలు చూపిస్తూ గురువారం రోజంతా ఫేక్ న్యూస్​ ప్రసారం చేసింది. బతుకుదెరువు కోసం ఓ డ్రైవర్​తన హైర్ వెహికల్​లో జగిత్యాలకు గూడ్స్ సరఫరా చేయడాన్ని హుజూరాబాద్ బైపోల్​తో ముడిపెట్టింది. నిజామాబాద్–జగిత్యాల రూట్​తో హూజూరాబాద్​కు ఏ సంబంధం లేకపోయినా ఈటల రాజేందర్ తరఫున కుట్టుమిషన్లు పంచడానికి తీసుకెళ్తున్నట్లు గులాబీ చానెల్ నిస్సిగ్గుగా తప్పుడు కథనాలను ప్రసారం చేసి పైశాచిక ఆనందం పొందింది.

అసలేం జరిగిందంటే..
జగిత్యాల ప్రింటింగ్​ ప్రెస్ నుంచి నిజామాబాద్ కు ప్రతిరోజూ వెలుగు పేపర్​సప్లై చేసేందుకు ఓ మారుతీ ఎకో వ్యాన్​ను హైర్​ చేసుకున్నారు. ఈ వ్యాన్ డెయిలీ రాత్రి ప్రింట్ అయిన పేపర్​తో బయలుదేరి ఉదయం 5 గంటల కల్లా నిజామాబాద్ చేరుకుంటుంది. ఏ పేపర్​కైనా ఇలాంటి హైర్ ​వెహికల్సే నడుస్తాయి. పేపర్ డెలివరీ అయ్యాక ఆ వెహికల్స్​కు ప్రెస్ తో ఎలాంటి సంబంధం ఉండదు. రిటర్న్​లో వెహికల్స్ ​డ్రైవర్లు ఖాళీగా రాకుండా ప్యాసింజర్ ను ఎక్కించుకోవడమో, ఏవైనా గూడ్స్ ట్రాన్స్​పోర్ట్ చేయడమో చేస్తారు. వెలుగు పేపర్ ను నిజామాబాద్​ తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్​ సైతం రిటర్న్ లో పెట్రోల్​ ఖర్చుల కోసం నిజామాబాద్ లోని ​హోల్​సేల్​ షాపుల నుంచి ​కుట్టుమెషీన్లు, డ్రెస్ ​మెటీరియల్, ఇతర గూడ్స్​ను మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణాల్లోని రిటైల్ ​షాపులకు సప్లై చేసుకుంటున్నాడు. బుధవారం సాయంత్రం కూడా నిజామాబాద్​లోని ఓ హోల్​సేల్​షాపు నుంచి 22 కుట్టుమెషీన్లు, డ్రెస్​మెటీరియల్ తో జగిత్యాలకు వస్తుండగా.. దొంగచాటుగా కొందరు వీడియో తీశారు. నిజామాబాద్–జగిత్యాల రూట్​తో హుజూరాబాద్​కు ఏ సంబంధం లేకున్నా, 
ఆ కుట్టు మెషీన్లను హుజూరాబాద్​లో పంచడానికే తీసుకెళ్తున్నట్లు, తామేదో గొప్ప ఇన్వెస్టిగేషన్​ చేసి కనుక్కున్నట్లు కట్టుకథ అల్లి గురువారం, పింక్​ చానెల్​లో బ్రేకింగ్​ న్యూస్​గా నడిపారు. సోషల్ మీడియాలోనూ వైరల్ చేశారు.

క్రెడిబిలిటీ దెబ్బతీసేందుకే.. 
నిజాలను నిర్భయంగా చెప్పే ‘వీ6–వెలుగు’కు తెలంగాణ సమాజంలో ఎనలేని ఆదరణ ఉంది. ఈ క్రెడిబిలిటీని దెబ్బతీసేందుకు కొన్ని రాజకీయ శక్తులు ఎన్నో రకాల కుట్రలు పన్నుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ వీ6–వెలుగు పై తప్పుడు కథనాలతో బురద జల్లేందుకు 
ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం తమ సొంత చానెల్​ను, సోషల్ ​మీడియా విభాగాన్ని అడ్డంగా వాడుకుంటున్నాయి. గతంలో జీహెచ్​ఎంసీ, గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎలక్షన్స్​ టైంలోనూ వీ6–వెలుగు పేరిట ఫేక్​ సర్వేలను వైరల్​ చేసి ఓటర్లను గందరగోళానికి గురిచేశారు. తాజాగా హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతున్నారు. మొన్నటికి మొన్న ఈటల రాజేందర్​కు, బీజేపీకి వ్యతిరేకంగా వీ6–వెలుగు పేరుతో ఫేక్​ న్యూస్​ క్లిప్పింగులు తయారుచేసి సోషల్ మీడియాలో వైరల్​ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ కండువా కప్పినట్లు, తాను తప్పు చేశానని సీఎం కేసీఆర్​కు ఈటల రాజేందర్​ లెటర్ రాసినట్లు, రెడ్లు, ముస్లింల ఓట్లు తనకు అవసరం లేదని ఈటల చెప్పినట్లు.. వీ6–వెలుగు లో వచ్చినట్లుగా క్లిప్పింగులు తయారుచేసి సర్క్యులేట్​ చేశారు. గులాబీ చానెల్, పేపర్ లో చెబితే ఎవరూ నమ్మరు గనుక ‘వీ6–వెలుగు’ క్రెడిబిలిటీని ఇట్ల వాడుకున్నారు. ఈ పాచికలేవీ పారకపోవడంతో ఇప్పుడీ కుట్టు మెషీన్ల డ్రామా తెరపైకి తెచ్చి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.

రెగ్యులర్​ ఆర్డర్​లో భాగమే
మాకు జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద కుట్టు మెషీన్ల షాపు ఉంది. రెగ్యులర్ గా నిజామాబాద్ నుంచి కుట్టు మెషీన్లను ఆర్డర్​పై తెప్పిస్తుంటాం. రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో ఈ మధ్య ప్రైవేట్ వెహికల్స్​లో తెప్పిస్తున్నం. నిజామాబాద్ కు ప్రతిరోజూ వెలుగు పేపర్ తీసుకెళ్లే వెహికిల్ రిటర్న్​లో జగిత్యాలకు ఖాళీగా వస్తుంది. బుధవారం వచ్చేటప్పుడు కుట్టు మెషీన్లు అందులో తీసుకొచ్చారు. ఇవి మా రెగ్యులర్ ఆర్డర్​లో భాగమే.
                                                                                                                                                                                          - వినయ్, జగిత్యాల 

పెట్రోల్ ​ఖర్చుల కోసం గూడ్స్​ సప్లై చేసుకుంట..
నేను ‘వీ6 –వెలుగు’ పేపర్ల ట్రాన్స్​పోర్ట్ ఆపరేటర్​గా పనిచేస్తున్న. తెల్లవారుజామున జగిత్యాల నుంచి నిజామాబాద్​కు పేపర్​లోడ్​తో వెళ్త. రిటర్న్​లో పెట్రోల్ ఖర్చుల కోసం లాక్​డౌన్​కు ముందు ప్రయాణికులను తీసుకెళ్లేటోడిని. లాక్​డౌన్ తర్వాత ప్యాసింజర్స్ లేక నిజామాబాద్​లోని​ కేఎంసీ స్టోర్ నుంచి జగిత్యాల, మెట్​పల్లి, కోరుట్ల తదితర పట్టణాలకు కుట్టుమిషన్లు, బట్టలు, డ్రెస్​మెటీరియల్ ​ట్రాన్స్​పోర్ట్​ చేస్తున్న. ఎవరో నిన్న వెహికల్ ను వీడియో తీసి హుజూరాబాద్​ ఎన్నిలకు సామాన్లు తీసుకెళ్తున్నట్లు తప్పుడు వార్త వైరల్ ​చేసిన్రు. పొట్ట కూటి కోసం డ్రైవర్​గా నేను చేసిన పనిని రాజకీయం చేయడం దారుణం.
                                                                                                                                                                                ‑ నరేందర్​, వ్యాన్​ డ్రైవర్