ప్రధాని మోడీ, అమిత్ షాతో కేసీఆర్ భేటీ

ప్రధాని మోడీ, అమిత్ షాతో కేసీఆర్ భేటీ

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. విభజన చట్టంలో భాగంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధానితో చర్చించారు.

అంతకుముందు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు సీఎం కేసీఆర్. CM తోపాటు.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా అమిత్ షాతో చర్చలో పాల్గొన్నారు. హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు తీసుకున్నాక కేసీఆర్ కలవడం ఇదే మొదటిసారి. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు కేసీఆర్.