
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తు న్నాయి. తప్పులను ప్రశ్నించే ప్రతిపక్షాలపై, ప్రజాసంఘాలపై సీఎం హోదాలో నాడు కేసీఆర్ వేసిన స్కెచ్‌లు, ప్లాన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల టైమ్‌లో ప్రతిపక్ష నేతల కదలికలను తెలుసుకునేందుకు వాళ్లందరి ఫోన్లను ట్యాప్ చేయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు విచారణలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి.
మునుగోడు ఉప ఎన్నిక టైమ్‌లో ఎమెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామితోపాటు వాళ్ల బంధువులు, అనుచరులను ఫోన్లను గత సర్కార్ ట్యాప్ చేయించింది. నాటి సీఎంవో ఆఫీస్ నుంచి వచ్చిన పేర్లు, ఫోన్ నంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తుల కదలికలు, ఫోన్లపై నిఘా పెట్టినట్లు రాధాకిషన్‌రావు అంగీకరించాడు.
ఫోన్ ట్యాపింగ్‌ను సొంత పార్టీ(బీఆర్ఎస్) నేతలపైనా కేసీఆర్ ప్రయోగించారు. పార్టీకి ఇబ్బందికరంగా అనిపించిన సొంత పార్టీ నేతలను కూడా ఆయన వదలలేదని రాధాకిషన్‌రావు వెల్లడించాడు. ఇందుకోసం ప్రణీత్‌రావు ఆధ్వర్యంలో స్పెషల్ సర్వెలైన్స్ నడిచిందన్నాడు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ నేత శంభీపూర్ రాజుపై, అదేవిధంగా ఇతర సందర్భాల్లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య సునీత, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డిపైనా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిఘా పెట్టినట్లు తేలింది.