నవీన్‌ కుమార్‌‌కు బీఫామ్ అందజేసిన కేసీఆర్

నవీన్‌ కుమార్‌‌కు బీఫామ్ అందజేసిన కేసీఆర్

హైదరాబాద్, వెలుగు :  మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల అభ్యర్థి నాగర్‌‌కుంట నవీన్‌ కుమార్‌‌రెడ్డికి బీఆర్‌‌ఎస్ చీఫ్ కేసీఆర్ శనివారం బీఫామ్ అందజేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రావుల చంద్రశేఖర్‌‌రెడ్డి తదితరులతో కలిసి నవీన్‌కుమార్‌‌ శనివారం హైదరాబాద్‌ నందీనగర్‌‌లోని కేసీఆర్‌‌ ఇంటికి వెళ్లారు. అక్కడ కేసీఆర్‌‌ నవీన్‌కు బీఫామ్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నవీన్ గెలుపు కోసం కృషి చేయాలని పాలమూరు నాయకులకు కేసీఆర్ సూచించారు.