యువతను జులాయిలుగా మారుస్తుంది కేసీఆరే

యువతను జులాయిలుగా మారుస్తుంది కేసీఆరే

హైదరాబాద్ : తెలంగాణ వచ్చిన తర్వాత  ఆరు ఏండ్లలో రాష్ట్ర ప్రగతిపై చర్చించలేదన్నారు కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి. మంగళవారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. రెండు అంశాల్లో తెలంగాణ మాత్రం టాప్ లో ఉందన్నారు. ఒకటి అప్పుల ఊబిలోకి తెలంగాణను నెట్టడం. రెండోది మద్యం అమ్మకాల్లో రికార్డు స్థాయిలో తెలంగాణను ఉంచారన్నారు. ఆరు ఎండ్లలో సీఎం కేసీఆర్ రూ. 3 లక్షల 18 వేల కోట్లకు పైగానే అప్పులు చేశారన్నారు. ప్రతి ఏడాది రూ. 50 వేల కోట్ల చొప్పున అప్పులు చేసుకుంటు వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మొత్తం మద్యం వినియోగం రూ. 40 వేల కోట్లు జరిగిందన్న జీవన్ రెడ్డి.. ముఖ్యమంత్రి ప్రజలను మత్తులో ముంచుతున్నారని చెప్పారు.

మద్యంతో కుటుంబం ఆర్థిక పరిస్థితి చిన్నాబిన్నం అవుతుందని.. బెల్ట్ షాపులు ఊరికి 10 ఉన్నాయన్నారు. ప్రభుత్వం అండదండలతోనే బెల్ట్ షాపులు నడుస్తున్నాయని తెలిపారు. మద్యంలో ముంచుతూ సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయని.. మద్యం షాపులు పెంచలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పించకుండా యువతను కేసీఆర్ సర్కార్ తాగుబోతులను చేస్తుందన్నారు. యువతను జులాయిలుగా మారుస్తుంది కేసీఆరే అన్నారు జీవన్ రెడ్డి.