ప్రజా సమస్యలు ఎత్తిచూపుతున్నందుకే కేసులు

ప్రజా సమస్యలు ఎత్తిచూపుతున్నందుకే కేసులు

తెలంగాణలో పోలీసులు కండువా వేయని టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. భద్రాచలంలో మీటింగ్ పెడితే రూల్స్ అతిక్రమించారని కేసులు పెట్టారని మండిపడ్డారు. పాదయాత్ర చేస్తూ ప్రజల పక్షాల నిలబడి సమస్యలు ఎత్తి చూపుతున్నందుకు కేసులు పెడుతున్నారా అని షర్మిల ప్రశ్నించారు. అసలు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు కేసీఆర్ మీదే కేసులు పెట్టాలని అన్నారు. పోడు భూముల పట్టాలు ఇవ్వనందుకు, రుణమాఫీ చేయనందుకు ముఖ్యమంత్రిని జైలులో పెట్టి లాఠీలతో కొట్టాలని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ చెప్పిందని, కొత్త జిల్లాలు మండలాల్లో ఖాళీలు కలుపుకుంటే 3లక్షల ఉద్యోగాలు ఉంటాయని వాటన్నింటినీ భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

For more news..

ఏఎంసీ వైస్ చైర్మన్కు నివాళులర్పించిన కేటీఆర్

మెఘా కేసులో ఇంజెంక్షన్ ఆర్డర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్ట్