సీఎం కేసీఆర్ ఇవాళ నాగార్జున సాగర్ నియోజకర్గంలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా ముందుగా నెల్లికల్ దగ్గర 13 ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ఇందులో నెల్లికల్ లిఫ్టు ఇరిగేషన్ వరకు LLC పంప్ హౌజ్ నుంచి HLC 8,9 డిస్ట్రిబ్యూటరీ ద్వారా నీటి సరఫరాకు మరమ్మత్తుల పనులు ప్రారంభించారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో…పొగిల్ల ఎత్తిపోతల, కంబాల పల్లి ఎత్తిపోతల, నంబాపురం పెద్దగట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. పెద్దమునగాల ఎత్తిపోతల, ఎకెబిఆర్ ఎత్తిపోతల పథకం, మిర్యాల గూడ నియోజక వర్గ పరిధిలోని.. దున్నపోతుల గండి, బాల్లే పల్లి చాప్లాతాండా ఎత్తిపోతల పథకానికి శంకు స్థాపన చేశారు సీఎం కేసీఆర్. వీటితో పాటు కేశవాపురం కొండ్రాపోల్ , బొత్తల పాలెం వాడపల్లి. నాగార్జున సాగర్ మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలోని ఎస్ ఎల్ బీసీ కాల్వ 1.8 కిమీ నుంచి 70.52 కిమీ వరకు సిసీ లైనింగ్ కోసం..హుజూర్ నగర్ కోదాడ నియోజక వర్గాల పరిధిలో ముక్త్యాల బ్యాంచ్ కు ఎత్తిపోతల. జాన్ పహాడ్ బ్రాంచ్ కు ఎత్తిపోతల, జాన్ పహాడ్ బ్రాంచ్ డిస్ట్రిబ్యూటరీ సీసీ లైనింగ్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, ఇతర ట్యాంకులుకు సిసీ లైనింగ్, అధునీకరణ. సూర్యాపేట హుజూర్ నగర్ కోదాడ పరిధిలోని సాగర్ ఎడమ కాల్వ 70.52 కిమీనుంచి 115.4 కిమీ వరకు సీసీ లైనింగ్ అభివృద్ది పనులకు సంభందించిన శంకు స్థాపనలు చేశారు. నెల్లికల్ లో ఒకే చోట చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పనుల వివరాల మ్యాప్ లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఎత్తిపోతల పథకాలతో హుజూర్‌నగర్, సాగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
