ఇయ్యాల నాగార్జునసాగర్‌కు కేసీఆర్

ఇయ్యాల నాగార్జునసాగర్‌కు కేసీఆర్

హైదరాబాద్: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బుధవారం  సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నెల్లికల్​ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​లకు శంకుస్థాపన చేయనున్నారు. హాలియాలో జరిగే బహిరంగ సభలో మాట్లాడుతారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్న పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 11.40 కు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో నాగార్జున సాగర్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లికల్ తండాకు కాన్వాయ్ లో వెళ్లి నెల్లికల్ లిఫ్ట్ తో పాటు వివిధ నియోజకవర్గాలో నిర్మించే మరో 12 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం నాగార్జున సాగర్ లోని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో భోజనం చేస్తారు. అక్కడి నుంచి  మధ్యాహ్నం 3.10 గంటలకు హాలియా శివార్ల లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకుంటారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.10 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

ఇవి కూడా చదవండి

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎవరు..?

మేయర్, డిప్యూటీ మేయర్ బరిలో బీజేపీ

ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయింది

షర్మిల..జగన్ అన్న వదిలిన బాణం కాదు,కేసీఆర్ వదిలిన బాణం