కేసీఆర్ అవినీతి డబ్బులతో ఓట్లు కొంటాడట

కేసీఆర్ అవినీతి డబ్బులతో ఓట్లు కొంటాడట
  • బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి 

నల్గొండ: కేసీఆర్ పచ్చి అబద్దాల కోరు అని.. అవినీతి చేసి సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనే పని చేస్తున్నాడని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ మళ్లీ ప్రజలను మభ్యపెట్టడం ప్రారంభించాడని, ఓట్లు తాకట్టు పెట్టుకోవద్దని ఆయన కోరారు. బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లుగాని కొత్త రేషన్ కార్డులు గాని చివరకు ఉద్యోగాలు కూడా ఇస్తలేడని ఆరోపించారు. ప్రధాని మోడీ కరోనా టైంలో అందర్నీ ఆదుకున్నాడని, మహిళా సంఘాలకు రుణాలు, గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ప్రధాని మోడీయేనని ఆయన తెలిపారు. నాగార్జునసాగర్ లో ఇరిగేషన్ ప్రాజెక్టు లు రాలేదని ఎస్ ఎల్ బి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేస్తలేడని ఆయన ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ తో కుమ్మకై జనాలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులే రాష్ట్ర సర్కార్ పంపిణీ చేస్తోందని, ఎక్కువ నిధులు కేంద్రం నిధులేనని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కమిషన్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ఆయన విమర్శించారు. ప్రధాని ఆవాస్ యోజన, కిసాన్ భీమా పథకం, ఆయుష్ మాన్ భారత్ పథకాలను  మోడీ ప్రవేశ పెడితే.. ఇక్కడ కేసీఆర్ అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. అందుకే కేసీఆర్ మాటల గారడీతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని.. రవి నాయక్ ను గెలిపించి కనువిప్పు కలిగించాలని వివేక్ వెంకటస్వామి కోరారు.