తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన సాగుతోంది విమర్శించారు బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్. ఆయన నాయకత్వంలో ఆలీ బాబా గ్రూప్ తెలంగాణను దోచుకుంటోందన్నారు. బీజేపీ మాత్రమే తెలంగాణను కేసీఆర్ నుంచి రక్షిస్తుందన్నారు స్పష్టం చేశారు.మహాత్మా గాంధీ యాత్రతో బ్రిటిష్ వాళ్ళు పారిపోయినట్లు.. బండి యాత్రతో తెలంగాణ నుంచి కేసీఆర్ పారిపోతారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే పోలీసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. పేదల సమస్యల పై బండి సంజయ్ యాత్ర చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ అనే రావణుడిపై ప్రతీ బీజేపీ కార్యకర్త.. రాముడి అవతారం ఎత్తి పోరాడాలని చెప్పారు.
