కేడీ ది డెవిల్ మూవీ తెలుగు వర్షన్ ఇవాళే ( మే 15 ) విడుదల 

కేడీ ది డెవిల్ మూవీ తెలుగు వర్షన్ ఇవాళే ( మే 15 ) విడుదల 

కన్నడ హీరో ధృవ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో  కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై  వెంకట్ కె నారాయణ నిర్మించిన చిత్రం ‘కేడీ ది డెవిల్’. కన్నడలో ఇప్పటికే విడుదల కాగా, తెలుగు రాష్ట్రాల్లో మే 15న రిలీజ్ అవుతోంది. గురువారం తెలుగు వెర్షన్ ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. కంప్లీట్ యాక్షన్ కట్స్‌‌తో వచ్చిన ట్రైలర్ సినిమాపై  హైప్‌‌ని  క్రియేట్  చేసింది.

ప్రారంభం నుంచే మాస్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్, స్టైలిష్ విజువల్స్‌‌తోపాటు  ధృవ సర్జా పవర్‌‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. తన పాత్రను చాలా ఇంటెన్స్‌‌గా డిజైన్ చేసినట్లు అర్ధమవుతోంది.  సంజయ్ దత్ మాస్ గెటప్‌‌లో  పవర్‌‌‌‌ఫుల్ రోల్‌‌తో  మెప్పించారు.   

దర్శకుడు ప్రేమ్ తన మార్క్ మాస్ టేకింగ్‌‌తో  హై వోల్టేజ్ యాక్షన్ ప్యాకేజ్‌‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. అర్జున్ జన్య అందించిన  బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్‌‌ను మరింత ఎలివేట్ చేసేలా ఉన్నాయి.