కామెడీని బతికించండి.. ‘మిత్ర మండలి’ ఈవెంట్లో బ్రహ్మానందం

కామెడీని బతికించండి.. ‘మిత్ర మండలి’ ఈవెంట్లో బ్రహ్మానందం

ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్‌‌ఎం  లీడ్ రోల్స్‌‌లో  విజయేందర్ ఎస్  రూపొందిస్తున్న  చిత్రం ‘మిత్ర మండలి’.  బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, రెండు పాటలు రిలీజ్ చేయగా తాజాగా ‘జంబర్ గింబర్ లాలా’ అంటూ సాగే మూడో పాటను విడుదల చేశారు. ఈ సాంగ్  లాంచ్ ఈవెంట్‌‌ను హైదరాబాద్‌‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌‌లో నిర్వహించారు.

కార్యక్రమానికి హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అందరూ కుర్రోళ్లే.  అందుకే ఇందులో నటించా.  అందరూ హాయిగా నవ్వుకునే సినిమా తీయాలనే గొప్ప ఆలోచనతో ఉన్న దర్శక నిర్మాతలకు  నా అభినందనలు. తమ జీవితం ఎలా ఉన్నా, అందరినీ నవ్వించాలనే సిద్ధాంతంతో బతుకుతున్నారు కమెడియన్స్. అందుకే కమెడియన్స్‌‌ని ఆశీర్వదించండి, కామెడీని బ్రతికించండి. కామెడీ బతికితే అందరూ ఆనందంగా ఉంటారు’ అని అన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను  కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందని నటీనటులు, దర్శక నిర్మాతలు అన్నారు. అక్టోబర్ 16న సినిమా విడుదల కానుంది.