
ఎంతోమంది హీరోయిన్స్‌కు స్ఫూర్తి శ్రీదేవి. ఆమెలా ఇటు సౌత్‌లో, అటు బాలీవుడ్‌లో పేరు తెచ్చుకోవాలని చాలామంది హీరోయిన్స్ ప్రయత్నాలు చేస్తుంటారు. శ్రీదేవిలా ఉన్నావు అంటే చాలు మురిసిపోతారు. కానీ శ్రీదేవితో పోల్చుకోవడమంటే అంత ఈజీ కాదు. కానీ శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ అంటూ కీర్తి సురేష్ ప్రశంసలు అందుకుంది. ఈమాట ఎవరో అన్నది కాదు.. ఏకంగా శ్రీదేవి భర్త బోణీకపూరే కీర్తికి ఇచ్చిన కాంప్లిమెంట్ అది.
ఇటీవల చెన్నైలో జరిగిన ‘మామన్నన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బోణీకపూర్ ఈ కామెంట్స్ చేశారు. శ్రీదేవి తరహాలో అందం, అభినయం రెండూ కీర్తిలో ఉన్నాయన్నారు. మరోవైపు తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై కూడా ఇదే ఈవెంట్‌లో కీర్తి క్లారిటీ ఇచ్చింది తన పెళ్లికి సంబంధించిన వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చానని, ప్రతిసారి అదే ప్రశ్న అడగొద్దని, ఒకవేళ పెళ్లికి ప్లాన్ చేస్తే ముందే ప్రకటిస్తానని చెప్పింది కీర్తి. దీంతో ఆమె పెళ్లిపై వస్తున్న రూమర్స్‌కి కూడా చెక్ పడింది. ఉదయనిధి స్టాలిన్‌కి జంటగా కీర్తి సురేష్ నటించిన ‘మామన్నన్’ చిత్రం త్వరలో విడుదల కానుంది.