కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో జేకే చంద్రు తెరకెక్కించిన క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రివాల్వర్ రీటా’. సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సునీల్, అజయ్ ఘోష్ కీలకపాత్రలు పోషించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న క్రమంలో ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు చాలా డార్క్ కామెడీ సినిమాలను చూసుంటారు. కానీ ఇది ఫిమేల్ లీడ్‌గా వస్తున్న పర్ఫెక్ట్ డార్క్ కామెడీ మూవీ. ఒక్క రోజులో జరిగే కథ. అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. చంద్రు పక్కా కమర్షియల్ సినిమాగా తీశారు. తప్పకుండా థియేటర్స్‌తో అలరిస్తుంది. నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ ‘‘మహానటి’గా నవరసాలు పలికించిన కీర్తి సురేష్‌తో నటించడం ఆనందంగా ఉంది. సెట్‌లో ఆవిడ ఎంతో నమ్రతతో ఉంటారు. షూటింగ్ చివరి రోజు స్వయంగా ఆమెనే పిలిచి ఫోటోలు తీసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇందులో ఆమె యాక్షన్‌ను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇక చంద్రు అద్భుతంగా ఈ సినిమాను తీశారు. అలాగే కొత్త సునీల్ గారిని చూస్తారు’ అని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్ కుమార్ తెలియజేశారు.
