పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్‌లో కొంత గ్యాప్ తీసుకోవడం కామన్. కానీ కీర్తి సురేష్ లాంటి హీరోయిన్స్ మాత్రం వరుస సినిమాలతో మరింత స్పీడు పెంచుతున్నారు. ఇప్పటికే తను నటించిన రెండు తమిళ సినిమాలు, ఓ వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా, తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ మలయాళ చిత్రానికి కూడా సైన్ చేసింది. శుక్రవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అంగామలై డైరీస్, జల్లికట్టు, ఆర్డీఎక్స్ లాంటి చిత్రాలతో మలయాళంలో యాక్షన్ హీరోగా మెప్పిస్తూ పెపేగా పాపులర్ అయిన ఆంటోనీ వర్గీస్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. రిషి శిక కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
‘‘యాక్షన్ అట్రాక్షన్‌ను, శక్తి శౌర్యాన్ని కలిసినట్టుగా ఫస్ట్ టైమ్ పెపే, కీర్తి కలిసి నటించబోతున్నారు..”అంటూ ఓ వీడియోతో ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ విని హీరోహీరోయిన్స్ ఇద్దరూ ఈ మూవీకి సైన్ చేస్తున్నట్టుగా ఈ వీడియోలో చూపించారు. ఫస్ట్ పేజ్ ఎంటర్‌టైన్మెంట్, అవ ప్రొడక్షన్స్, మార్గ ఎంటర్‌టైనర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జంటగా ‘రౌడీ జనార్ధన్’లో నటిస్తున్న కీర్తి సురేష్.. మరోవైపు ‘బలగం’ ఫేమ్ వేణు తీరకెక్కించనున్న ‘ఎల్లమ్మ’ చిత్రంలోనూ నటించబోతోంది.
