కీసర గుట్ట హుండీ ఆదాయం.. గతేడాది కంటే రూ.19 లక్షలు అధికం

కీసర గుట్ట హుండీ ఆదాయం.. గతేడాది కంటే రూ.19 లక్షలు అధికం

కీసరగుట్టలో మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజులు పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ క్రమంలో ఇవాళ ఎండోమెంట్ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. హుండీ ఆదాయం రూ.28,52,536 వచ్చింది. ప్రసాదాల ఆదాయం రూ.28,26,600, దర్శనాలు, అభిషేకలకు రూ.37,01,685, ఆన్ లైన్ పూజ ఆదాయం రూ.9,19,000, డోనేషన్స్ 38,801 రూపాయలు వచ్చాయి.

ఈ సందర్భంగా ఆలయ ఈ ఓ సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2022 సంవత్సరంలో హుండీ ఆదాయం రూ.83,74,632 రాగ.. ఈ సంవత్సరంలో 1,03,38,622 రూపాయలు వచ్చాయని తెలిపారు. గతేడాది కంటే ఈ సంవత్సరం రూ.19,63,990 అధికంగా ఆదాయం వచ్చిందని అన్నారు. ఈ డబ్బులను కీసర SBI అకౌంట్ లో జమ చేస్తామని వెల్లడించారు.