
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లిక్కర్ పాలసీ కేసులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. జూలై 12న ఉదయమే ఈడీ నమోదు చేసీన మనీలాండరింగ్ కేసులో ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా.. డిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ కేసులో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ కోర్టుకు హాజరైయ్యారు. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. జూలై 25 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ఆయన విచారణ ఇంకా కొనసాగనుంది.