గుజరాత్పై కేజ్రీవాల్ ఫోకస్

గుజరాత్పై కేజ్రీవాల్ ఫోకస్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ దృష్టి గుజరాత్ పై పడింది. త్వరలో ఆయన గుజరాత్ లో పర్యటించబోతున్నారు. ఇప్పటికే పంజాబ్లో అధికారం చేజిక్కించుకున్న ఆప్..గుజరాత్ లో జెండా ఎగురవేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా  జులై 3 అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ కు వెళ్లనున్నారు.  3వ తేదీన అహ్మదబాద్ లోని ఆప్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ఇతర సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత జులై 4న టౌన్ హాల్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 

ఇక గుజరాత్ ఎన్నికల ఈ ఏడాది డిసెంబర్ చివర్లో జరగనున్నాయి. మొత్తం 182 అసెంబ్లీ సీట్లకు గానూ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించనుంది. ప్రస్తుతం గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లను గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షపార్టీ హోదాను దక్కించుకుంది. అయితే  అప్పటి ఎన్నికల్లో ఆప్ పోటీ చేసినా..ఒక్క సీటును కూడా దక్కించుకోలేదు. కేవలం 0.1 శాతం ఓట్లను మాత్రమే పొందింది. అయితే ఇటీవల పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయకేతనం ఎగురవేసింది. 117 సీట్లకుగానూ 92 సీట్లను కైవసం చేసుకుని అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో గుజరాత్ లో జరగనున్న ఎన్నికల్లో  ఎలాగైనా ఖాతా ఓపెన్ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే జులై 3,4 తేదీల్లో అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్లో పర్యటించబోతున్నారు.