కేంద్రీయ విద్యాలయాల్లో బాల్‌వాటిక 1, 2, 3ల్లో ప్రీ ప్రైమరీ తరగతుల్లో అడ్మిషన్స్‌కు కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్లకు పైబడి ఆరేళ్ల లోపు వయసు కలిగిన బాలబాలికలు అడ్మిషన్లు పొందవచ్చు. బా ల్ వాటికల్లోని ప్రీ ప్రైమరీ తరగతుల్లో చేర్పించేందుకు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
వయసు : బాల్‌వాటిక-1కు బాలబాలికల వయసు మార్చి 31, 2024 నాటికి మూడేళ్లు పూర్తయి నాలుగేళ్లు మించకూడదు. ఏప్రిల్ 1న జన్మించిన వారికీ అవకాశం ఉంటుంది. బాల్‌వాటిక-2కు నాలుగేళ్లు పూర్తయి, అయిదేళ్లు మించరాదు. బాలవాటిక-3లో ప్రవేశాలకు అయిదేళ్లు నిండి, ఆరేళ్లు మించకూడదు.
దరఖాస్తులు : ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిషన్స్ ప్రక్రియ మే 22 నుంచి 27 మధ్య ఉంటుంది. అడ్మిషన్లకు తుది గడువు జూన్ 29. పూర్తి సమాచారం కోసం www.kvsangathan.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.