ఆర్ఎస్ఎస్ నేత ఇంట్లో 770 కిలోల పేలుడు పదార్థాలు

ఆర్ఎస్ఎస్ నేత ఇంట్లో 770 కిలోల పేలుడు పదార్థాలు

కేరళ రాష్ట్రంలోని పన్నూరు కోవళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంటర్ పొయిలూర్ ఏరియాలో ఆర్ఎస్ఎస్ నేత ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమైయ్యాయి. ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ నాయకుడు వడకెయిల్ ప్రమోద్ బంధువు వడకెయిల్ శాంత ఇంట్లో నిల్వ ఉంచిన 770 కిలోల పేలుడు పదార్థాలను కోవళ్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు కొవళ్లూర్ పోలీస్ ఇన్పెక్టర్ సుమిత్ కుమార్, సబ్ ఇన్ స్పెక్టర్ కె.కె సోబిన్ నేతృత్వంలో  తనిఖీలు చేశారు. లైసెన్స్ లేకుండా అక్రమంగా వీటిని నిల్వ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.