అంబులెన్స్ ను ఢీ కొట్టిన మంత్రి కాన్వాయ్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

అంబులెన్స్ ను ఢీ కొట్టిన మంత్రి కాన్వాయ్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి కాన్వాయ్‌.. ఓ అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ వ్యాన్‌ బోల్తా కొట్టడంతో.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కొట్టారకరలోని పులమన్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ వీడియోలో ఓ పక్క నుంచి అంబులెన్స్ వస్తుండగా.. అది చూసుకోకుండా మంత్రి కాన్వాయ్ వచ్చి ఢీకొట్టింది. ఆ తర్వాత అటుగా వస్తోన్న బైక్ ను కూడా ఢీకొట్టింది. కానీ అంతలోనే ఆ బైక్ డ్రైవర్ వేగం తగ్గించి, బండి ఆపేయడంతో వారికి ప్రమాదం తప్పింది. అంతే కాదు కాన్వాయ్.. అంబులెన్స్ ను ఢీకొట్టిన తర్వాత.. అది అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కూడా ఢీకొట్టేందుకు దగ్గరగా వచ్చింది. కానీ అదృష్టవశాత్తు అతనికి ఎలాంటి ప్రమాదం కాలేదు. మంత్రి కాన్వాయ్‌ వెళ్లేందుకు కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ప్రమాదం జరిగనట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత మంత్రి.. వాహనం దిగి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారని మరికొందరు చెబుతున్నారు.