పేరు మారుతోంది: కేరళ కాదు ఇకపై కేరళం ..అసెంబ్లీ ఆమోదం

పేరు మారుతోంది: కేరళ కాదు ఇకపై కేరళం ..అసెంబ్లీ ఆమోదం

కేరళ రాష్ట్రం పేరు మారుతోంది. కేరళ పేరును కేరళంగా మార్చే సవరణ బిల్లుకు కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇక కేంద్రం ఆమోదించడమే ఆలస్యం.. కేరళ పేరు కేరళంగా మారుతుంది. 

రాష్ట్రం పేరును కేరళ నుంచి కేరళం గా మార్చాలని చిన్నచిన్న సవరణలతో సోమవారం కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో ఈ బిల్లును కేంద్రానికి పంపగా దిద్దుబాట్లను ఎత్తి చూపుతూ తిరిగి పంపించింది. అయితే కేరళ అసెంబ్లీ కొత్త తీర్మానాన్ని ఆమోదించింది. 

రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ లో రాష్ట్రాన్ని అధికారికంగా కేరళం గా మార్చడానికి 2023 ఆగస్టు 9న కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మాణం చేసింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని తీర్మానంలో కేంద్రాన్ని కోరింది. అదేవిధంగా ఎనిమిదో షెడ్యూల్‌లోని అన్ని భాషల్లో పేరును 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేశారు.

అయితే వివరణాత్మక ధృవీకరణ తర్వాత అటువంటి సవరణ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మాత్రమే అవసరమని కనుగొనబడింది. అందుకే కొత్త తీర్మానం తీసుకువస్తున్నట్లు సీఎం వివరించారు.

మలయాళంలో 'కేరళం' అనే పేరు సాధారణంగా వాడుకలో ఉందని సీఎం పినరయి తన తీర్మానంలో సూచించారు. అయితే అధికారిక రికార్డుల్లో రాష్ట్రాన్ని 'కేరళ' అని పిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తీర్మానం చేశారు.