
కేరళలోని ఎర్నాకులం జనరల్ హాస్పిటల్‌లో హృదయాన్ని కదిలించే ఓ ఘటన చోటుచేసుకుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న అనారోగ్యంతో బాధపడుతున్న పాట్నా మహిళ ఆకలితో ఉన్న నాలుగు నెలల శిశువుకు పాలివ్వడానికి కొచ్చి మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక పోలీసు అధికారిణి ముందుకు వచ్చారు. సివిల్ పోలీస్ ఆఫీసర్ MA ఆర్య, స్వయంగా తొమ్మిది నెలల పాప తల్లి. ఆమె పాట్నా మహిళ బిడ్డకు తల్లి పాలు అందించడంతో ఇప్పుడు అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నారు.
ప్రస్తుతం ఓ కేసుకు సంబంధించి జైలులో ఉన్న మహిళ.. భర్తతో పాటు కుటుంబానికి దూరంగా చాలా కాలంగా కేరళలో నివసిస్తోందని పోలీసులు వెల్లడించారు. ఆమె ముగ్గురు పెద్ద పిల్లలకు ఆహారం అందించడానికి స్టేషన్ సిబ్బంది సహకరించడంతో పోలీసులకు ప్రశంసలు లభించాయి. తదనంతరం, పిల్లలను చైల్డ్ కేర్ హోమ్‌కు తరలించి, వారి శ్రేయస్సు కోసం అనుకూలమైన వాతావరణాన్ని కల్పించినట్టు పోలీసులు తెలిపారు. ఆర్య శిశువును ఓదార్చడాన్ని వర్ణిస్తూ, పోలీసులు పంచుకున్న ఫొటోలో ఒకటి అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే ఆమె ఆ చిన్నారికి తల్లి పాలివ్వడం. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.