సెలవులు కట్ : స్కూల్ జరిగే రోజులు పెంచిన ప్రభుత్వం

సెలవులు కట్ : స్కూల్ జరిగే రోజులు పెంచిన ప్రభుత్వం

కేరళలో ప్రభుత్వ పాఠశాలల్లో పని రోజులను 198 నుంచి 205కి పెంచినట్లు అక్కడి విద్యాశాఖ వెల్లడించింది. దీంతో విద్యార్థులకు 6 రోజులపాటు సెలవులు తగ్గించినట్లయింది. ఈ నిర్ణయం 2023–24 విద్యాసంవత్సరం నుంచే అమలులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. విద్యా సంవత్సరంలో పనిదినాల సంఖ్యను 210కి పెంచాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు దానిని సవరించి 205గా నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. 

వేసవి సెలవుల తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు అన్ని శనివారాలు పని రోజులుగా ఉంటాయనే ప్రచారాన్ని కూడా విద్యాశాఖ తోసిపుచ్చింది. విద్యా సంవత్సరంలో మొత్తం 52 శనివారాల్లో 13 మాత్రమే పనిదినాలుగా నిర్ణయించినట్లు తెలిపింది.