
18ఏళ్లు పైబడిన విద్యార్థులకు 60 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయనున్నట్టు కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు తెలిపారు. అదేంటీ విద్యార్ధులకు మెటర్నిటీ లీవులా అని ఆశ్చర్యపోవచ్చు. కానీ యూనివర్శిటీల్లో వివాహితలు కూడా ఉంటారు.. వారు పీజీలు, పీహెచ్ డీలు చేస్తుంటారు. అటువంటివారికి వీలు కల్పిస్తూ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా గర్భిణి విద్యార్ధులకు మెటర్నిటీ లీవులను 60రోజులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీయూఎస్‌ఏటీ) తమ విద్యార్థులకు ఇప్పటికే రుతుక్రమ సెలవులు అందించే దిశగా ప్రణాళికలు చేస్తోందన్నారు.. ఈ సెలవులతో వారికి అవసరమైన హాజరు శాతం75 గా ఉంటుందని వెల్లడించారు.
రుతుక్రమ సమయంలో విద్యా్ర్థినులు ఎదుర్కొనే మానసిక, శారీరక ఇబ్బందులు పరిగణలోకి తీసుకొని కేరళ ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని యూనివర్సిటీలకు దీన్ని విస్తరించాలని యోచిస్తోందని చెప్పారు. ఎస్ఎఫ్ఐ నేతృత్వంలోని విద్యార్థి సంఘం డిమాండ్ మేరకు సీసాట్ లో రుతుక్రమం సెలవులు అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. CUSAT స్టూడెంట్స్ యూనియన్ తో పాటు వివిధ విద్యాసంస్థల నుండి అధికారికంగా ఈ ప్రతిపాదనను వైస్ ఛాన్స్ లర్ కు సమర్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయానికి ఆమెదం తెలుపుతూ వర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది.