రూ.2 లక్షల ఐటీ ఉద్యోగం వదిలేసి.. పూజారిగా మారిపోయాడు

రూ.2 లక్షల ఐటీ ఉద్యోగం వదిలేసి.. పూజారిగా మారిపోయాడు

నెలకు రూ.2 లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా.. లేదు కదా..  కానీ కేరళకు చెందిన  ఉన్నికృష్ణన్ ఆధ్యాత్మికతపై ఉన్న ఆసక్తితో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి పూజారిగా మారిపోయాడు.   ఆయన పూజారి మాత్రమే కాదు, బైక్ రైడింగ్ కూడా.  కేరళలోని కొట్టాయం జిల్లా మంజూర్ గ్రామంలోని పుదుక్కులంగర దేవి ఆలయంలో పూజారిగా ఆధ్యాత్మిక ప్రయాణం సాగిస్తున్నాడు ఉన్నికృష్ణన్. 

 ఆలయంలో పూజలు  ఉదయం 9.30 గంటలకు ముగించుకుని ఆతరువాత బైక్ రేసింగ్ గా మారుతాడు.  కాళ్లకు షూలు, చేతులకు గ్లౌజులు, తలకు హెల్మెట్, రేసింగ్ సూట్ ధరించి బైక్ తో కొండల మధ్యలోకి వెళ్తాడు. 2007లో లైసెన్స్ పొందిన తర్వాత ఉన్నికృష్ణన్ రేసింగ్‌పై ఆసక్తి కనబరిచాడు.  కొచ్చిలోని ఒక ప్రొఫెషనల్ రేసింగ్ క్లబ్‌లో చేరి శిక్షణ తీసుకున్నాడు. 

 కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన ఉన్నికృష్ణన్ కొచ్చిలో  ఐటీ సెక్టార్‌లో కొన్నా్ళ్లు పనిచేశాడు.  అయితే జాబుతో పాటుగా ఆధ్యాత్మికతం, బైక్  రేసింగ్ ను బ్యాలెన్స్ చేయకపోవడంతో జాబ్ ను వదిలేశాడు.  ఉన్నికృష్ణన్ తండ్రి నారాయణన్ నంబూతిరి కూడా పూజారి . ఆయన మరణం తర్వాత ఉన్నికృష్ణన్ ఆలయ బాధ్యతలు చేపట్టారు.

 డిసెంబర్ 2021 నుండి ఆలయ పూజారితో పాటుగాతన బైక్ రేసింగ్ చేసుకుంటూ జీవితాన్ని తనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు.   మొదట్లో భక్తులు, స్థానికులు తన అవతారం చూసి ఆశ్చర్యపోయేవారని కానీ  ఇప్పుడు వాళ్లకు అలవాటుగా మారిందన్నారు.