
ఫోన్లు పేలుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తునే ఉన్నాం. తాజాగా ఓ యువకుడి ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ సడెన్ గా పేలింది. అతడు వేసుకున్న బట్టలకు మంటలకు అంటుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో చోటు చేసుకుంది.
రైల్వేస్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగి హరీస్ రెహమాన్ ముఖం కడుక్కుందామని వాష్ రూమ్ కు వెళ్లగా అతని ప్యాంటు జేబులో ఉన్న రియల్ మీ ఫోన్ పేలింది. పక్కనే ఉన్నవారు మంటలు అర్పి అతన్ని ఆసుపత్రికి తరలించారు.
రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్‌లో అనుకోకుండా మంటలు చెలరేగాయని రెహమాన్ తెలిపారు. డిస్‌ప్లే నెలల క్రితమే మార్చానని చెప్పాడు. రెహమాన్‌ను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి డిశ్చార్జి చేశారు. ఈ ఘటనపై తాను వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేస్తానని తెలిపాడు.
ఏప్రిల్ 24వ తేదీన త్రిస్సూర్‌లో ఎనిమిదేళ్ల బాలిక వీడియో చూస్తుండగా మొబైల్ ఫోన్ పేలి చనిపోయింది. మృతురాలు పాతయన్నూర్‌కు చెందిన అశోక్‌కుమార్, సౌమ్య దంపతుల కుమార్తె ఆదిత్యశ్రీ. చేతులకు, ముఖానికి తీవ్ర గాయాలైన చిన్నారి వెంటనే మృతి చెందింది.