వీక్లీ లక్కీ డ్రాలో రూ.45 కోట్లు.. విదేశాల్లో వరించిన లక్ష్మీదేవి

వీక్లీ లక్కీ డ్రాలో రూ.45 కోట్లు.. విదేశాల్లో వరించిన లక్ష్మీదేవి

యూఏఈలో లాటరీల  పుణ్యమా అని మధ్యతరగతికి చెందిన భారతీయులు కోటీశ్వరులు అవుతున్నారు.  తాజాగా ఓ భారతీయుడికి జాక్ పాట్ తగిలింది.  కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీజు గత 11 సంవత్సరాలుగా దుబాయ్‌కి తూర్పున 120 కిలోమీటర్ల దూరంలోని ఫుజైరాలో ఉంటూ గ్యాస్ పరిశ్రమలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.  

శ్రీజు గత మూడేళ్లుగా మహ్‌జూజ్ లక్కీడ్రాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం జరిగిన డ్రాలో శ్రీజు  45 కోట్లు గెలుచుకున్నాడు.  ఈ విషయం తెలియగానే తాను చాలా ఆశర్యపోయానని శ్రీజు  తెలిపాడు. ఇప్పటికి నమ్మలేకపోతున్నానని అన్నాడు.  

ఈ లాటరీలో గెలిచిన డబ్బుల ద్వారా తన అప్పులను తీర్చుతానని,  అలాగే తన స్వగ్రామంలో ఇళ్లు కట్టుకుంటానని చెప్పాడు.   కాగా యూఏఈలో లక్కీ డ్రాలలో గెలుచుకునే డబ్బుపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు డ్రా ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది.