రాజీనామా నా వ్యక్తిగత నిర్ణయం

రాజీనామా నా వ్యక్తిగత నిర్ణయం

కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారని ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో కేబినెట్ పదవికి రాజీనామా చేశారు. వీలైనంత మంది సాధారణ ప్రజలను దోచుకునేలా మన రాజ్యాంగాన్ని రాశారని.. సాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పాతానమిట్టలో జరిగిన సీపీఎం సమావేశాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. చెరియన్ దిద్దుబాటు చర్యలకు దిగారు.

తాను రాజ్యాంగాన్ని దూషించలేదని.. తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవం ఉందన్నారు. పాలనా వ్యవస్థ సరిగా లేదనే.. కోణంలో తాను మాట్లాడనన్నారు. రాజీనామా చేశానన్నారు. రాజీనామా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. తానెప్పుడూ రాజ్యాంగాన్ని కించపరదలేదని.. ప్రసంగంలోని ఓ భాగాన్ని తీసుకుని వక్రీకరించానన్నారు. సీపీఎంను, ఎల్ డీఎఫ్ ను బలహీనపరిచేందుకే ఇలా చేశారన్నారు సాజీ చెరియన్.