రుజువు చేస్తే కోటి రూపాయలు.. "ది కేరళ స్టోరీ" మేకర్స్ కి ముస్లిం లీగ్ సవాల్.

రుజువు చేస్తే కోటి రూపాయలు.. "ది కేరళ స్టోరీ" మేకర్స్ కి ముస్లిం లీగ్  సవాల్.

కేరళ రాష్ట్రంలో మిస్సైన 32000 మంది అమ్మాయిల కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ "ది కేరళ స్టోరీ". సుదీప్తోసేన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. మే 5న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ పై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ.. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఈ సినిమా ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాలను విడుదల చేయకూడదంటూ అధికార, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

తాజాగా కేరళ ముస్లిం యూత్ లీగ్ కూడా ఈ సినిమాపై తీవ్ర విమర్శలు చేసింది. టీజర్, ట్రైలర్ లో చూపించినట్లుగా.. కేరళకు చెందిన 32,000 మంది అమ్మాయిలను  బలవంతంగా మతమార్పిడి చేసి ఐఎస్‌ఐఎస్‌లో చేర్చుకున్నారని ఎవరైనా రుజువు చేస్తే వారికి భారీగా నగదు బహుమతి అందిస్తామని ఆఫర్ ఇచ్చింది.  సినిమా విడుదల చేసే ముందు నిర్మాతలు, దర్శకుడు ఈ విషయాన్ని రుజువు చేయాలని ముస్లిం యూత్ లీగ్ డిమాండ్ చేసింది. ఒకవేళ వేల రుజువు చేస్తే వారికి రూ. 1 కోటి నగదు బహుమతిని ఇస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ముస్లిం యూత్ లీగ్ చేసిన ఈ కామెంట్స్ దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

అయితే.. ఈ సినిమా తీయడానికి ముందు చాలా రీసెర్చ్ చేశామని  డైరెక్టర్ సుదీప్తో సేన్ తెలిపారు. దాదాపు ఏడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డామని, అమ్మాయిల మిస్సింగ్ కథ విన్నప్పుడు ఇలాంటివి మన దేశంలో కూడా జరుగుతాయా అనుకున్నానని సుదీప్తో సేన్ అన్నారు.  కానీ, రీసెర్చ్ చేశాక నిజాలు తెలుసుకొని ఆశ్చర్యపోయానని చెప్పారు.  దీని గురించి అంతా తెలుసుకున్నాకే సినిమా తీశాను” అని ఆమె వివరించారు.  మే 5న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.