16 నుంచి శబరిమల యాత్ర.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి

16 నుంచి శబరిమల యాత్ర.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి

పతనంథిట్ట: శబరిమల ఆలయం వచ్చేవారం తెరుచుకోనుంది. ఈ నెల 15న సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో పూజారి వీకే జయరాజ్ పొట్టి ఆలయ గర్భగుడి తలుపులు తెరుస్తారని ట్రావెన్​కోర్ దేవస్థానం శుక్రవారం ప్రకటించిం ది. భక్తుల మండల యాత్రకు 16 నుంచి అనుమతిస్తామని చెప్పింది. దర్శనానికి రోజుకు 30 వేల మంది భక్తులను అనుమతించనున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. భక్తులకు ఆన్​లైన్​ పోర్టల్ ​ద్వారా టికెట్ల బుకింగ్ సౌకర్యం కల్పించనున్నా రు. ఈయేడు పంపా నదిలో స్నానా లకు భక్తులకు అనుమతిస్తామని అధికారులు చెప్పారు. దర్శనానికి వచ్చేవాళ్లకు వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు.