‘కేరళను కరోనా సూపర్ స్ప్రెడర్ గా మారుస్తారా?’

‘కేరళను కరోనా సూపర్ స్ప్రెడర్ గా మారుస్తారా?’

తిరువనంతపురం: వలస కూలీలను తరలించడానికి నడుతుపుతున్న స్పెషల్ ట్రెయిన్స్ నిర్వహణపై మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో తాజాగా కేరళ కూడా ఆబ్జెక్షన్ చెప్పింది. ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ట్రెయిన్స్ ను పంపడం ద్వారా రాష్ట్రాల కరోనా నియంత్రణ ప్రోటోకాల్ ను రైల్వేస్ దెబ్బతీస్తోందని పేర్కొంది. కరోనా నియంత్రణలో కేరళ చాలా ప్రభావంతంగా పని చేస్తోంది. మంగళవారం ఆ స్టేట్ సీఎం పినరయ్ విజయన్ ఈ విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీనిపై తాజాగా కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ కూడా స్పందించారు. కరోనా వైరస్ కు కేరళ సూపర్ స్ప్రెడర్ లా మారాలని రైల్వేస్ కోరుకుంటోందని ఆయన విమర్శించారు.

‘గత వారం ముంబై నుంచి ఓ ట్రెయిన్ వచ్చింది. ఆ రైలు జర్నీ స్టార్ట్ అయిన తర్వాతే అది వస్తోందన్న విషయం మాకు తెలిసింది. షెడ్యూల్ లో లేని విషయమిది, అలాగే ఆపలేనిది కూడా. ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ లో మెజారిటీ ప్రయాణికులకు పాస్ లు లేవు. మహమ్మారి చెలరేగుతున్న ఈ టైమ్ లో ఇది అరాచకం. రైల్వేస్ కేరళను వైరస్ సూపర్ స్ప్రెడర్ గా చేయాలనుకుంటోంది. అరవడం ఆపి.. బాధ్యతగా ప్రవర్తించండి. కనీసం రైళ్లను ట్రాక్ చేయడానికైనా యత్నంచండి’ అని థామస్ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర నుంచి ఎంత మంది, ఎప్పుడు వస్తున్నారనే దానికి సంబంధించి కనీసం తమకు లిస్ట్ ఇస్తే.. అందుకు అవసరమైన స్క్రీనింగ్, హోం క్వారంటైన్ లాంటి ఏర్పాట్లను చేసుండే వాళ్లమని సీఎం విజయన్ తెలిపారు. కేరళలో కరోనా కేసుల సంఖ్య 896 గా నమోదైంది. ఇటీవలే మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వారిలో 72 మందికి పాజిటివ్ గా తేలింది.