మా పెళ్లి రిజిస్టర్ చేయాలని హైకోర్టుకు వెళ్తం

మా పెళ్లి రిజిస్టర్ చేయాలని హైకోర్టుకు వెళ్తం

ప్రేమికుల దినోత్సవం రోజున (సోమవారం) కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. కేరళలోని త్రిసూర్ లోని టెక్నో పార్క్ లో ఉన్న ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న మను కార్తీక గతంలో అమ్మాయి. కొన్నాళ్ల క్రితం జెండర్ మార్చుకుని అబ్బాయిగా జీవిస్తున్నాడు. అలాగే తిరువనంతపురంలో కేరళ సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్జెండర్ సెల్లో పని చేస్తున్న శ్యామ ఎస్ ప్రభ గతంలో అబ్బాయి. ప్రస్తుతం లింగ మార్పిడి తర్వాత అమ్మాయి తన జీవితాన్ని సాగిస్తూ.. తనలా ట్రాన్స్ జెండర్స్ గా మారిన వారి సమస్యలను తీర్చేందుకు చేతనైన సాయం చేస్తోంది. కొంత కాలం క్రితం శ్యామ, మను కార్తీకల మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమకు బాటలు వేసింది. ఆ ఇద్దరూ పెండ్లి చేసుకుని ఒక్కటిగా జీవించాలని కోరుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పి ఒప్పించి.. నిన్న వాలంటైన్స్ డే రోజున ఒక్కటయ్యారు. తిరువనంతపురంలో కుటుంబసభ్యులు, బంధువుల మధ్య వేడుకగా పెళ్లి చేసుకున్నారు. 

‘ట్రాన్స్’ ఐడెంటిటీ కింద పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం...

వాలంటైన్స్ డే రోజున పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నామంది ఈ ట్రాన్స్ జెండర్ జంట. ఇప్పడు తమ పెండ్లిని రిజిస్టర్ చేసుకోవడం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని మను, శ్యామ చెబుతున్నారు. ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కింద వివాహాన్ని రిజిస్ట్రర్ చేసుకుంటామని, ఇందుకు అవసరమైన లీగల్ పేపర్ వర్క్ పూర్తి చేస్తున్నామని అన్నారు. ‘‘లింగమార్పిడి చేసుకున్నవాళ్లు కొత్తగా వచ్చిన జెండర్ తో మేల్, లేదా ఫిమేల్ అని ఐడెంటిటీతో పెళ్లి రిజిస్టర్ చేసుకోవాలంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద సాధారణంగా అధికారులు రిజిస్టర్ చేసేస్తారు. కానీ మేం అలా కాకుండా ఇద్దరం ఒకే (ట్రాన్స్ జెండర్)  ఐటెంటిటీతో పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నాం. అందుకే హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నాం’’ అని మను, శ్యామ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

థియేటర్స్ లో కొవిడ్ రూల్స్ పాటించాల్సిందే

కేసీఆర్ ను ఎప్పుడూ నమ్మవద్దు

శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ