గవర్నమెంట్ జాబ్..అంబులెన్స్ లో ఎగ్జామ్ రాసిన యువతి

గవర్నమెంట్ జాబ్..అంబులెన్స్ లో ఎగ్జామ్ రాసిన యువతి

కరోనా ప్రపంచ దేశాల్ని కకావికలం చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకునే నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయింది. కరోనా బారిన పడి లేదంటే, కరోనా భయం వల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు  సంబంధింత ఎగ్జామ్స్ రాసే సాహసం చేయలేదు.

అయితే తాజాగా ఓ యువతికి కరోనా వచ్చిన పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎగ్జామ్స్ ను అంబులెన్స్ లో కూర్చొని రాసింది.

కేరళ తిరువనంతపురానికి చెందిన గోపిక గోపన్ అనే యువతి అసిస్టెంట్ ఫ్రొఫెసర్ జాబ్ కోసం ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో గోపిక పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎగ్జామ్ రాయాల్సి ఉండగా..ఆమెకు కరోనా సోకింది. దీంతో కరోనా సోకిందని బయపడకుండా ఎగ్జామ్ ను అంబులెన్స్ కూర్చొని రాసింది.

నాకు కరోనా సోకింది. ఈ ఎగ్జామ్ కోసం చాలా కష్టపడ్డా. కరోనా సోకినా సరే అంబులెన్స్ లో కూర్చొని పరీక్ష రాశాను. ఆ సమయంలో నా చుట్టు పక్కల ఏం జరుగుతుందనే విషయాన్ని నేను మరిచి పోయి ఎగ్జామ్ కంప్లీట్ చేశానని చెప్పింది.