
వయనాడ్ ఘటనపై రాజ్యసభలో కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. కొండ చరియలు విరిగే పడే అవకాశం ఉందని ఈ నెల 23న కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామని అమిత్ షా అన్నారు. ముందే హెచ్చరించినా ప్రజలను తరలించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందన్నారు...
అమిత్ ప్రకటనకు కేరళ ముఖ్యమంత్రి విజయన్ కౌంటరిచ్చారు. వయినాడ్ ఘటన విషయంలో కేంద్రప్రభుత్వం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదని సీఎం విజయన్ అన్నారు. బీజేపీ ప్రభత్వం ప్రకృతి విపత్తును రాజకీయం చేయడం దురదృష్టకరమని అంటూ... ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. కేరళ సర్కార్ ను బ్లేమ్ చేయడానికి ఇది సరైన సమయం కాదంటూ.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎల్లో అలర్ట్ ఉందని కేరళ ముఖ్యమంత్రి విజయన్ అన్నారు.