జ్ఞానవాపి కేసుపై తీర్పు నేడే

జ్ఞానవాపి కేసుపై తీర్పు నేడే

ఢిల్లీ జ్ఞానవాపి కేసుపై వారణాసి జిల్లా కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనునంది. ఈ తీర్పు నేపథ్యంలో వారణాసిలో హై అలర్ట్ ప్రకటించారు. వారణాసిలో ఇప్పటికే144 సెక్షన్ విధించారు. తీర్పు తర్వాత ఎటువంటి అల్లర్లు జరక్కుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రశాంత పరిస్థితుల కోసం మతపెద్దలతో పోలీసులు ఇంతకుమునుపే సంప్రదింపులు జరిపారు. ఈ పిటిషన్ అభ్యంతరాలపై ఇప్పటికే వాదనలు విన్న జిల్లా న్యాయమూర్తి అజయ్ కృష్ణ, ఆగస్టు 24వ తేదీనే తీర్పును సిద్ధం చేసి వాయిదా వేశారు. అయితే నేడు అదే తీర్పును ప్రకటించనున్నారు.

మసీదు కాంప్లెక్స్ లోని హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ ఐదుగురు మహిళలు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది. అయితే అది శివలింగం కాదని మసీద్ కమిటీ వాదిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరి, తిరిగి వారణాసికే చేరింది. వీడియో రికార్డింగ్ కు సంబంధించిన ఫుటేజీలు లీక్ కావడంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. దీంతో నేడు వెలువడనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈ తీర్పు వారికి వ్యతిరేకంగా వస్తే.. అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తామని పిటిషన్లు స్పష్టం చేస్తున్నారు.