టీటీడీ  పాలక మండలి కీలక నిర్ణయాలు

టీటీడీ  పాలక మండలి కీలక నిర్ణయాలు

టీటీడీ  పాలక మండలి  సమావేశంలో  కీలక నిర్ణయాలు  తీసుకున్నారు. అన్నమయ్య  మార్గాన్ని అభివృద్ధి  చేయాలని  నిర్ణయించామన్నారు  టీటీడీ   చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి. అన్నమయ్య మార్గంలో  రోడ్డు, కాలినడక  మార్గాలను  నిర్మించి అందుబాటులోకి  తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే  పూర్తిస్థాయిలో  నివేదిక తయారు  చేసి రోడ్డు,  కాలినడక మార్గాలను  నిర్మిస్తామన్నారు. కరోనా  మార్గదర్శకాలు  సడలిస్తే   సంక్రాంతి నుంచి  దర్శనాల సంఖ్య పెంచుతామన్నారు.