కేజీబీవీలో అధ్యాపకుల పోస్టులకు ఆహ్వానం

కేజీబీవీలో అధ్యాపకుల పోస్టులకు ఆహ్వానం

వేములవాడ రూరల్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్​ మండలం మర్రిపల్లిలోని కేజీబీవీలో అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని స్పెషల్​ఆఫీసర్​ పద్మ సూచించారు. మర్రిపల్లితో పాటు సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల విద్యార్థులకు అకడమిక్ సపోర్ట్ కోసం నిపుణులైన ఫ్యాకల్టీ అవసరమన్నారు. నీట్, ఐఐటీ, జేఈఈ సంబంధిత ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు గంటల ప్రాతిపాదికన అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకుల అవసరం ఉందన్నారు.

ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ కెమెస్ట్రీ, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్​ లేదా తత్సమాన కోర్సులు, ఎంఎస్సీ బాటనీ/జువాలజీ, క్లాట్ ఎల్ఎల్​బీ/ఎల్ఎల్ఎం లేదా సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, లీగల్ రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఉండాలన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు కేజీబీవీ ప్రత్యేక అధికారులను సంప్రదించాలని కోరారు. మంగళవారం చివరి తేదీ అని చెప్పారు.