రివ్యూ: కేజీఎఫ్ 2

రివ్యూ: కేజీఎఫ్ 2

రన్ టైమ్ : 2 గంటల 40 నిమిషాలు.
నటీనటులు: యశ్,సంజయ్ దత్,రవీనా టండన్, శ్రీనిధి శెట్టి,ప్రకాశ్ రాజ్,రావు రమేష్, తదితరులు
సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ
మ్యూజిక్ : రవి బర్సూర్
యాక్షన్: అనిభర్
నిర్మాత: హోంబలే ఫిలింస్
రచన,దర్శకత్వం: ప్రశాంత్ నీల్
రిలీజ్ డేట్ : ఏప్రిల్ 14,2022

ఎలాంట ఎక్స్  పెక్టేషన్స్ లేకుండా మూడేళ్ల క్రితం ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజైన ‘‘కె.జి.ఎఫ్’’ మెల్లమెల్లగా సంచలనం సృష్టించింది. యాక్షన్ సినిమా జానర్ లో కొత్త ఒరవడి ని పరిచయం చేసింది.అదే హైప్ ను కంటిన్యూ చేస్తూ సినిమాకు సీక్వెల్ ను తీసారు మేకర్స్. ఈ సారి అంచనాలు పెరిగాయి. పెద్ద ప్యాన్ ఇండియా సినిమా గా రిలీజైంది.మరి ఎంతవరకు ఎక్స్  పెక్టేషన్స్ రీచ్ అయిందో తెలుసుకుందాం.

కథేంటి?

గరుడ ను చంపిన తర్వాత రాకీ భాయ్ డాన్ గా ఎదిగి కె.జి.ఎప్ ప్రాంతాన్ని ఏలుతాడు. ఎక్కువ మైనింగ్ చేసి బాగా బంగారాన్ని సంపాదిస్తాడు. ప్రత్యర్థులు రాకీ ని ఎలా అయిన చంపాలనుకుంటారు.అందుకోసం భయంకరమైన అదీరా ‘(సంజయ్ దత్) వస్తాడు. తనను ఎలా ఎదుర్కున్నాడు. మధ్యలో రాజకీయ శక్తులు ఎందుకొచ్చాయి.చివరికి రాకీ భాయ్ ను పట్టుకున్నారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్:

హీరో యశ్ అధ్బుతమైన పర్ఫార్మెన్స్ అందించాడు.రాకీ భాయ్ పాత్రను ఓన్ చేసుకుని ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు.స్టైల్ అండ్ స్వాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.సంజయ్ దత్ పాత్ర అధ్బుతంగా ఉంది.భీకరమైన అధీరా పాత్రలో రాణించాడు. రవీనా టాండన్ పాత్ర కూడా చాలా బాగుంది.పవర్ ఫుల్ ప్రధాన మంత్రి పాత్రలో ఆమె రాణించింది.శ్రీనిధి శెట్టి పాత్ర చిన్నగా ఉన్నా బాగుంది.  ప్రకాష్ రాజ్,రావు రమేష్ లు తమ పాత్రల్లో మెప్పించారు.సినిమాకు ప్లస్ అయ్యారు.అయ్యప్ప శర్మ తదితరులు కూడా బాగా చేశారు.

టెక్నికల్ వర్క్ :

టెక్నికల్ వర్క్ విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్సూర్ ను అప్రిషియేట్ చేయాల్సింది. పాటలు ఏవి గుర్తుండకపోయినా..తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రతీ సీన్ ను ఎలివేట్ చేశాడు.సినిమా గ్రాఫ్ పడిపోయినప్పుడల్లా తన సౌండ్ డిజైన్, ఆర్.ఆర్ తో లేపాడు.భువన్ గౌడ సినిమాటోగ్రపీ అధ్బుతంగా ఉంది.ఆర్ట్ వర్క్,ప్రొడక్షన్ వాల్యూయ్స్ అన్నీ బాగున్నాయి.డైలాగులు అధ్బుతంగా రాసారు.

విశ్లేషణ:

కె.జి.ఎఫ్ అంచనాలు భారీగా ఉన్నాయి.అన్ని అంచనాలను చేరుకోగలిగింది.పార్ట్ వన్ కు ఏమాత్రం తగ్గకుండా ఉందీ సినిమా. అంతే కాదు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే అబ్బురపరుస్తాయి.ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా..సెకండాఫ్ గ్రిప్పింగ్ గా,ఇంట్రెస్టింగ్ గా అనిపస్తాయి. ప్రతీ సీన్ ఉత్కంఠ గా సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.భారీ సెటప్, యశ్ పర్ఫార్మెన్స్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకుడిని కనీసం పక్కకు తిరిగి చూడకుండా చేస్తాయి.అందరూ కె.జి.ఎఫ్ ప్రపంచంలో లీనమైపోతారు. యాక్షన్ జానర్ లో ఈ సినిమా కొత్త ట్రెండ్ ను సృష్టించింది. యాక్షన్ జానర్ ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా ఆకలి తీరుస్తుంది.ఎలివేషన్ లు,యాక్షన్ సీన్లు బోలెడన్ని.అక్కడక్కడా కొన్ని సార్లు గ్రాఫ్ తగ్గినట్టనిపించినా..మదర్ సెంటిమెంట్ తో దాన్ని భర్తీ చేశాడు డైరెక్టర్.రాను రాను ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయం. ఎండ్ టైటిల్స్ లో కొసమెరుపు గా కె.జి.ఎఫ్ చాప్టర్ 3 కూడా ఉంటుందని చెప్పాడు డైరెక్టర్.దాంతో మార్వెల్ సిరీస్ లాగా కె.జి.ఎఫ్ సిరీస్ కంటిన్యూ అవుతుందనుకోవచ్చు.

బాటమ్ లైన్: బాక్సాఫీస్ మాన్ స్టర్